కోనసీమలో పింఛన్ల పంపిణీకి రూ. 83. 97 కోట్లు విడుదల

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం గురువారం రూ. 83.97 కోట్లు విడుదలయ్యాయి. డీఆర్డీఏ పీడీ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని 19 మండలాలు, మూడు మునిసిపాలిటీల పరిధిలో ఉన్న 1,94,669 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. మే నెలకు సంబంధించి కొత్తగా 261 పింఛన్లు, అందులో 222 స్పౌజ్ పింఛన్లు, 39 హెల్త్ పింఛన్లు మంజూరయ్యాయి.

సంబంధిత పోస్ట్