రామచంద్రపురంలో నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 4న 44వ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సోమవారం తెలిపారు. కేవీఆర్ హాస్పిటల్ వెనుక ఉపాధి కార్యాలయంలో జరిగే ఈ మేళాలో 18-35 ఏళ్ల లోపు అభ్యర్థులు పాల్గొనవచ్చు. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్ కాన్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి సంస్థలలో శ్రీసిటీ, చెన్నై, బెంగళూరుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 15,000-20,000 జీతంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, భోజన, రవాణా సౌకర్యాలు ఉంటాయి. ఆసక్తిగలవారు 7075704852, 7075904854 నంబర్లలో సంప్రదించవచ్చు.