మహిళా సాధికారతే లక్ష్యం.. మంత్రి సుభాష్

కె. గంగవరంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో 'మహిళా సాధికారత' నినాదంతో ఒక ప్రత్యేక సమావేశం ఆదివారం జరిగింది. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు తన సోదరి శ్రీ సత్య సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా, స్థానిక మహిళలు, యువతులకు వివిధ రంగాల్లో ఉచిత ఉపాధి శిక్షణ ఇప్పిస్తామని, సొంత వ్యాపారాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి సుభాష్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్