ప్రకృతి వ్యవసాయానికి 1,240 మట్టి నమూనాలు తరలింపు

రాజవొమ్మంగి మండలంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న పొలాల నుండి సేకరించిన 1,240 మట్టి నమూనాలను కాకినాడ జిల్లా సామర్లకోటలోని పరీక్షా కేంద్రానికి బుధవారం తరలించినట్లు మండల ఇంచార్జి పల్లి రామస్వామి తెలిపారు. మండలంలోని 12 పంచాయతీల్లో 1240 ఎకరాల విస్తీర్ణంలో మట్టి సేకరణ జరిగిందని యం. టి. పద్మజ పేర్కొన్నారు. శ్రీను, అప్పలరాజు, రత్నరాజు, లక్ష్మణ్ రెడ్డి ఈ మట్టి నమూనాలను తరలించే ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ నమూనాలను పరీక్షల నిమిత్తం తరలించారు.

సంబంధిత పోస్ట్