రంపచోడవరంలోని పలు అక్రమ మైనింగ్ లపై లిఖితపూర్వకంగా ఐటీడీఏ పీఓకి గురువారం ఆదివాసి సంక్షేమ పరిషత్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ నియోజకవర్గం అక్రమ మెటల్ క్వారీలు ఉన్నాయని వాటి పై సమగ్ర విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన పిఓ, రంపచోడవరం సబ్ కలెక్టర్ వారిని విచారణ అధికారిగా నియమిస్తానని విచారణ చేయిస్తామన్నారు.