చింతూరు డివిజన్‌లో గోదావరి, శబరి నదుల్లో వరదల నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు చింతరేగుపల్లి గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్ ద్వారా ప్రజలకు వరదల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం చింతూరు ఏపీవో, ఎస్‌డీసీ శబరి బ్రిడ్జి, కూనవరం, చింతూరు బ్రిడ్జిలను పరిశీలించారు.