తూర్పుగోదావరి జిల్లాలో మే 28న జరగాల్సిన పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఇంగ్లిష్ పరీక్ష జూన్ 5వ తేదీకి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం మే 28న బక్రీద్ సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) కంది వాసుదేవరావు సోమవారం తెలిపారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.