అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి అన్నారు. మండలం లోని తoటికొండ, దూసరిపాము, రాజవొమ్మంగి గ్రామాల్లో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు గత ప్రభుత్వంలో లేని ఆనందాన్ని ఫించనుదారులు చూస్తున్నారని అలాగే ప్రతీ ఇంటికీ వెళ్లి ఫింఛన్లు పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు.