వరి సేకరణలో తూర్పు గోదావరి జిల్లా ముందంజ: జేసీ వై. మేఘా స్వరూప్

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ వరి సేకరణ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. జనవరి 1, 2026 నాటికి పీపీసీల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 47,426 మంది రైతులు ధాన్యం విక్రయించారు. ఈ సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జేసీ అన్నారు.

సంబంధిత పోస్ట్