టీడీపీ అభివృద్ధికి అందరూ సమైక్యంగా కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం గంగవరంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అధిక సభ్యత్వాలు నమోదు చేసి పార్టీ అభివృద్ధిలో చురుకుగా పాల్గొంటున్న ముఖ్య కార్యకర్తలను సత్కరించారు. టీడీపీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీషదేవి, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.