ఆదివాసి నవోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏఎస్పి మరియు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఏడుగురులపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఆదివాసి సంస్కృతి పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ఆదివాసి సంస్కృతి అంటే ఆదివాసి భాష ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు జీవనశైలి ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగమని అన్నారు.