అల్లూరి సీతారామరాజు జిల్లా, రాజవొమ్మంగి మండలంలో శుక్రవారం ఉదయం నుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రోహిణి కార్తెలో ఇలా వర్షాలు కురవడం రైతులకు కాస్త ఉపశమనాన్నిచ్చింది. తొలకరి సాగుకు ఈ వర్షాలు ఎంతో అవసరమని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ అకాల వర్షం వ్యవసాయ పనులకు ఊతమిస్తుందని భావిస్తున్నారు.