ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి సమయంలో కూనవరం మండలంలోని కోతులగుట్ట గ్రామంలో ఉన్న ఆదివాసి హక్కుల కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీం విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ దుర్మార్గమైన చర్యను కొమరం భీం విగ్రహ కోఆర్డినేషన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.