గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి శుక్రవారం అల్లూరి జిల్లాలో పర్యటించనున్నారు అని అధికారులు గురువారం తెలిపారు. ఉదయం 10.30కి కలెక్టరేట్‌లో పీ-4 మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 11.30కి హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి రైతులకు మొక్కలు, విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ శ్రేణులతో సమావేశం జరగనుంది.