మోతుగూడెంలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో శుక్రవారం భక్తులు నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే సీలేరు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇంటి దగ్గర దీపాలు వెలిగించి, నైవేద్యం పెట్టి, పూజలు చేసిన తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు వెళ్లి నాగేంద్రస్వామి మంత్రం జపించి పాలు, గుడ్లు, తేగలు, నువ్వు పప్పు బెల్లం తో తయారు చేసినటువంటి పదార్థాలతో పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్