అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత భవనం నిర్మాణానికి ఆర్ధిక సహకారం అందించాలని గవర్నర్ సమక్షంలో రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వైడి రామారావుకు అల్లూరి జిల్లా బృందం వినతి పత్రం అందజేశారు. బుధవారం విజయవాడలో తుమ్మనపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అరవ వార్షిక సర్వసభ్య సమావేశానికి జిల్లా బృందం హాజరయ్యారు.