రాజవొమ్మంగి మండలంలోని శరభవరం గ్రామ సచివాలయంలో జూలై 14, 15, 16 తేదీల్లో ఆధార్ శిబిరం నిర్వహించనున్నట్టు ఎంపీడీవో యాదగిరేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఈ శిబిరంలో కొత్త ఆధార్ కార్డులు, చైల్డ్ ఆధార్, అడ్రస్ మార్పులు, చేర్పులు, అప్‌డేట్లు చేయవచ్చన్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.