విలీన మండలాల్లో వరద భయం మొదలయింది. శబరి, గోదావరి సంగమంలో వరద ప్రవాహం పెరుగుతోంది గడిచిన 48 గంటల్లో సుమారు 17 అడుగుల వరకు వరద ప్రవాహం పెరిగింది. కూనవరం మండలం కొండరాజుపేట కాజ్ వే పైకి వరద నీరు చేరడంతో పలు గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వి.ఆర్ పురం మండలం పోచవరం వెళ్లే ప్రధాన రహదారిలో కల్వర్టుపై వరద నీరు చేరడంతో పలు గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.