రంపచోడవరం: రూ.55 వేల జీతంతో ఉద్యోగం.. దరఖాస్తు చేసుకొండి

అస్పెరేషనల్ బ్లాక్ ఫెలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని రంపచోడవరం ITDA PO స్మరణ్ రాజ్ శనివారం ప్రకటనలో తెలిపారు. మారేడుమిల్లి మండలం పరిధిలో నీతి అయోగ్ పథకంలో పని చేయాల్సి ఉంటుందన్నారు. నెలకు రూ.55 వేల జీతంతో తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకం జరుగుతుందన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్, డేటా అనలిస్టుగా అనుభవం ఉన్నవారు ఫిబ్రవరి 9లోగా ITDA కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్