మారేడుమిల్లిలో ఆశ్రమ పాఠశాల (బాలురు) గ్రౌండ్ నందు & ఏకలవ్య స్కూల్ గ్రౌండ్ నందు మరియు పలు పాఠశాలల్లో వనవాసి స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ డా: గొర్లె అనుదీప్ కుమార్ ఆధ్వర్యంలో సుమారుగా వెయ్యి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పనస, జఫరా, జమా, బాధం, నేరుడు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి సర్పంచ్ కొండా జాకోబు విద్యార్థి, విద్యార్థినిలు పాల్గొన్నారు.