ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు తొలగించాలని 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ యస్ భార్గవి (ఐ ఎ యస్) విజయవాడ వారికి వినతిపత్రం గురువారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టం పటిష్టంగా అమలు కావటం లేదని అన్నారు.