రంపచోడవరం నియోజకవర్గం జనసేన వీరమహిళ పండా వరలక్ష్మి బుధవారం రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిశారు. సచివాలయంలో అయన ఛాంబర్ లో కలిసని ఆమె నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను మంత్రికి వివరించినట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా నియోజకవర్గంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వసితులు పడుతున్న కష్టాలతో పాటు పదకొండు మండలాలలో అస్తవ్యస్థంగా మారిన రోడ్లు పరిస్థితిపై మంత్రికి వివరించినట్లు తెలిపారు.