యువతకు రోడ్డు భద్రతపై అవగాహన: ప్రాణ భద్రతే ముఖ్యం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం పరిధిలో లోదొడ్డి గ్రామంలో యువతకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ వాడకం, అతివేగంతో డ్రైవింగ్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ లోత లక్ష్మణరావు, టిడిపి మండల వైస్ ప్రెసిడెంట్ మధు, పెదిరెడ్ల సత్తిబాబు, కోటము శెట్టి సత్తిబాబుతో పాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. గ్రామ యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్