కోడి పందాలు, పేకాటపై ఎస్పీ హెచ్చరిక: చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశామని, కోడి కత్తులు తయారు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. పోలీస్ నిబంధనలను ఎవరూ అతిక్రమించరాదని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్