గిరిజన కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ల కష్టాలు: మాజీ సర్పంచ్ ఆవేదన

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవొమ్మంగి మండలం, మారేడుబాక పంచాయతీ ఊర్లకులపాడు గ్రామంలో 100 గిరిజన కుటుంబాలు గ్యాస్ సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మాజీ సర్పంచ్ మేలిన లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఆన్లైన్లో బుక్ చేసినా డీలర్లు నంబర్ లేదని చెబుతున్నారని, సబ్సిడీ కూడా రావడం లేదని ఆయన వెల్లడించారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి తక్షణమే పరిష్కారం చూపాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్