అయినవిల్లి: కాజ్వే వద్దకు చేరిన గోదావరి వరద

అయినవిల్లి మండలం ముక్తేశ్వరం కాజ్వే వద్దకు గోదావరి వరద నీరు చేరడంతో సోమవారం ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ఉద్ధృతి పెరిగితే కాజ్వే మునిగి మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతారని వారు తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మెరక పనులు హామీలకే పరిమితమవుతున్నాయనీ పనులు పూర్తికావడం లేదనీ వాపోయారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్