అమలాపురం పట్టణంలో శ్రావణి ఆసుపత్రి సమీపంలో ప్రధాన రహదారిపై ఒక ఆంబోతు రెచ్చిపోయింది. ఈ క్రమంలో, ఆంబోతు బలంగా గుద్దడంతో ఒక వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, బాధితుడిని శ్రీనిధి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది.