అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు స్వామివారు, అమ్మవారు పంచముఖ ఆంజనేయ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం రాత్రి జరగనున్న స్వామివారి దివ్య కళ్యాణానికి సుమారు 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి తాగునీరు, అన్నప్రసాదం వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ రాంబాబు రాజు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.