సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారుల వలకు దాదాపు 300 కిలోల బరువున్న భారీ టేకు చేప చిక్కింది. దీనిని ఒడ్డుకు చేర్చడానికి మత్స్యకారులు శ్రమించాల్సి వచ్చింది. ఈ చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు. మత్స్యకారుల కథనం ప్రకారం, ఈ చేపలను ఔషధాల తయారీలో, వాటిపై ఉండే శంకులతో అలంకరణ సామగ్రి తయారీలో ఉపయోగిస్తారని తెలిపారు. శనివారం జరిగిన వేలంలో ఈ చేపను నర్సాపురం వ్యాపారి ఇరవై వేల రూపాయలకు కొనుగోలు చేశారు.