అంతర్వేది: రథ శకలాల నిమజ్జన కార్యక్రమం వాయిదా

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథ శకలాల నిమజ్జన కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ శుక్రవారం రాత్రి వాయిదా వేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దహనమైన పాత రథం స్థానంలో దేవస్థానం కొత్త రథాన్ని తయారు చేయించింది. పాత రథాన్ని శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నిమజ్జనం చేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ, ఆగమశాస్త్ర నిబంధనలు, ముహూర్తాలపై చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్