అంతర్వేది: నరసింహుడి ఆలయానికి రూ 2. 25 లక్షల ఆదాయం

సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి ఆదివారం కావడంతో భక్తులు భారీగా విచ్చేసారు. ఈ నేపథ్యంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామి వారి ఆలయానికి రూ 2, 25, 875 ఆదాయం లభించిందని ఆలయ ఈవో ప్రసాద్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు ఏవిధమైన ఇబ్బందులకు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్