అంతర్వేది స్వామివారి హుండీ ఆదాయం రూ. 18. 92 లక్షలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి హుండీ ఆదాయాన్ని మంగళవారం దేవస్థాన అధికారులు లెక్కించారు. గత 36 రోజులకు గాను హుండీల ద్వారా స్వామివారికి రూ. 18,92,187 నగదు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎం. కె. టి. నాగ వరప్రసాద్ తెలిపారు. అమలాపురం దేవాదాయ శాఖ తనిఖీదారు రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ఎంపీటీసీ నాగరాజు మరియు భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్