అంతర్వేది: చంద్రగ్రహణం సందర్భంగా సఖినేటిపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని అధికారులు మంగళవారం మూసివేశారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం గ్రహణ సమయంలో స్వామివారి దర్శనాలు, సేవలు నిలిపివేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. గ్రహణం అనంతరం బుధవారం ఉదయం ప్రత్యేక సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ఉదయం 5:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభిస్తారు. భక్తులు ఈ సమయాలను గమనించి సహకరించాలని కోరారు.