బైక్ దొంగతనం కేసు: నిందితుడికి 18 నెలల జైలు శిక్ష

అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బైక్ దొంగతనం కేసులో నిందితుడు శొంటిని గంగాధర్ కు అనకాపల్లిలోని XIII అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శ్రీమతి నికిత సెంగర్ 1 సంవత్సరం 6 నెలల (18 నెలలు) సాధారణ జైలు శిక్ష, రూ.1,000/- జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఒక నెల జైలు శిక్ష పడుతుంది. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అనకాపల్లి రూరల్ ఎస్సై జి.రవికుమార్, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ అభినందించారు. నేరస్థులకు శిక్ష పడేలా చేయడంలో పోలీసుల పాత్ర కీలకమని, పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం వల్లే ఈ శిక్ష సాధ్యమైందని ఎస్పీ పేర్కొన్నారు. దొంగతనాలకు పాల్పడే వారు చట్టం నుండి తప్పించుకోలేరని, ప్రజలు తమ వాహనాల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్