అంతర్వేదిలో వైభవంగా కంచు గరుడ వాహన సేవ

సఖినేటిపల్లి మండలం, అంతర్వేది క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారు కంచు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనంపై స్వామివారు పురవీధుల్లో విహరిస్తుండగా, భక్తులు జయజయధ్వానాల మధ్య నీరాజనాలు పలికారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. ఈ గ్రామోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్