అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తుఫానులు, ఇరుసుమండ బ్లో అవుట్ వంటి పెను ప్రమాదాల నుండి స్వామివారే ఈ ప్రాంత ప్రజలను రక్షిస్తున్నారని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా స్వామివారి కళ్యాణోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన వివరించారు.