అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న చాగంటి

సఖినేటిపల్లి మండలం, అంతర్వేది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు బుధవారం నాడు దర్శించుకున్నారు. ఆయన ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ అధికారులు, అర్చక స్వాములు పూర్ణకుంభంతో సాదరంగా ఆహ్వానించి, ఘనస్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకున్న ఆయన, ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్