అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న కలెక్టర్

సఖినేటిపల్లి మండలం అంతర్వేది పుణ్యక్షేత్రంలో కొలువైయున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ తన కుటుంబంతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం అందించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ కలెక్టర్ దంపతులకు స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్