క్షమాపణ చెప్పే వరకు పోరాటం ఆపం: రాజోలు వైసీపీ కోఆర్డినేటర్

మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఓ పత్రికాధినేతపై రాజోలు వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పత్రికాధినేత తక్షణమే మహిళా లోకానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలను అవమానించే విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని మండిపడిన ఆమె, ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని కోరారు. మహిళల ఆత్మగౌరవం కోసం క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం ఆపబోమని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్