డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, అగ్నేతపల్లి మండలం, సఖినేటిపల్లి బాడీరివులో క్రైస్తవులు కొరకు నిర్మించిన బాప్తీస్మం గాట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ శాసన సభ్యురాలు పాముల రాజేశ్వరి దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొల్లమందల చిట్టిబాబును శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుసుమ చంద్రశేఖర్, రాజోలు నియోజకవర్గం ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.