గోగన్నమఠం: 'జగన్ పేరు చెబితేనే కూటమి నేతలకు వణుకు'

గోగన్నమఠంలో మంగళవారం జరిగిన వైఎస్సార్‌సీపీ సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, ప్రజలు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కోరుకున్నారని, కూటమి ప్రభుత్వ ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని కాదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ పేరు చెబితేనే కూటమి నేతలకు వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సాగిస్తున్న దుర్మార్గపు, అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఈ అరాచకాలకు త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత భూపతిరాజు సత్తిబాబురాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్