గోగన్నమఠం: కూటమి ప్రభుత్వం ప్రజలకు శఠగోపం పెట్టింది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మంగళవారం మలికిపురం మండలం గోగన్నమఠంలో జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి శిక్షణ సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆక్వా, మొక్కజొన్న రైతుల నుంచి ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓట్ల చోరీని అరికట్టేందుకు, చంద్రబాబు దురాగతాలను అడ్డుకునేందుకే కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్