గూడపల్లి: మరిడి మహాలక్ష్మమ్మ అమ్మవారిని దర్శించుకున్న అమూల్య

గురువారం మలికిపురం మండలం అడవిపాలెంలో శ్రీ మరిడి మహాలక్ష్మమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు టీడీపీ ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ వారు గొల్లపల్లి అమూల్యతో పాటు ఇతర నాయకులను పూలమాలలు, దుశ్శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు సాయిబాబా రాజు, ముదునూరి చినబాబు రాజు, అడబాల సాయిబాబా తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్