గూడపల్లి: ఓఎన్జీసీ పరిహారం అందించాలని డిమాండ్

మలికిపురం మండలం గూడపల్లి గ్రామాన్ని ఓఎన్జీసీ నష్టపరిహార జాబితా నుండి తొలగించడంపై వైసీపీ గ్రామ అధ్యక్షుడు పొన్నం నాగేశ్వరరావు గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్లో అవుట్ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న ఇరుసుమండ, చింతలపల్లి, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామాలకు పరిహారం అందిస్తూ, గూడపల్లిని విస్మరించడంపై ఆయన నిలదీశారు. "మావి ప్రాణాలు కావా? " అంటూ ఓఎన్జీసీ వైఖరిని ప్రశ్నించారు. తక్షణమే స్పందించి గూడపల్లి గ్రామస్తులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్