గత ఆరు రోజులుగా ఇరుసుమండ గ్రామంలో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన బ్లో అవుట్ శనివారం అదుపులోకి వచ్చింది. సీఎంటీ హెడ్ శ్రీహరి నేతృత్వంలోని క్రైసిస్ మేనేజ్మెంట్ టీం మంటలను విజయవంతంగా అదుపు చేయడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆరు రోజుల క్రితం ఇరుసుమండ గ్రామంలోని మోరి-5 బావిలో గ్యాస్ లీక్ అయి ఈ బ్లో అవుట్ ఏర్పడింది.