మలికిపురం మండలం ఇరుసుమండలో సంభవించిన బ్లో అవుట్ ను ఓఎన్జీసీ అత్యంత వేగంగా, స్వదేశీ పరిజ్ఞానంతో కేవలం 5 రోజుల్లోనే నియంత్రించి తన సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకుంది. సీఎంటీ బృందం ప్రశంసలు అందుకుంది. గతంలో దేవర్లంక బ్లో అవుట్ కు 65 రోజులు, కొమరాడ బ్లో అవుట్ కు 26 రోజులు పట్టగా, ఇరుసుమండ బ్లో అవుట్ ను రికార్డు సమయంలో కట్టడి చేయడం విశేషం.