రాజోలు మండలంలోని కాట్రేనిపాడు గ్రామంలో సోమవారం రాత్రి కాటుమాయమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. చిత్ర విచిత్ర వేషధారణలు, కళాకారుల ప్రదర్శనలు, యువత డాన్సులు, బాణాసంచా వెలుగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో పురవీధులన్నీ కోలాహలంగా మారాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.