మలికిపురం మండలం లక్కవరంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో గృహ నిర్మాణ లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల కాలం నాటి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పీఎంఏవై-జీ 2.0 కింద గుర్తించిన వారికి గృహాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత సిమెంట్, ఐరన్ ధరలు, కూలి రేట్లు పెరిగిన నేపథ్యంలో గృహ నిర్మాణ యూనిట్ ధరను 1,80,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇల్లు నిర్మించుకుంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.