రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ లక్కవరంలో సోమవారం మాట్లాడుతూ, పేదరికం లేని సమాజ నిర్మాణమే పీ-4 (P-4) లక్ష్యమని, 2029 నాటికి రాష్ట్రంలో సున్నా పేదరికం సాధించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్ మోడళ్లలో ప్రజలను భాగస్వాములను చేస్తామని, సమాజంలోని 10% బలమైన వర్గాలు అట్టడుగున ఉన్న 20% కుటుంబాలను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.