ఐక్యపోరాటం చేద్దాం: మామిడికుదురులో కార్మికుల తీర్మానం

మామిడికుదురులో మే డే వేడుకలు శుక్రవారం ఎంఆర్‌సీ వద్ద ఘనంగా జరిగాయి. పెయింటర్స్ అసోసియేషన్, ఆటో కార్మిక యూనియన్, యూటీఎఫ్ ఆధ్వర్యంలో కార్మిక పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి కార్మికులకు అందాల్సిన రాయితీలు, హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ నాయకులు సత్యనారాయణ, కొండయ్య, కేశవరావు, నాగేంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్మిక ఐక్యతను చాటారు.

సంబంధిత పోస్ట్